పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

పర్వతగిరి, సెప్టెంబర్ 17, తరంగాలు ప్రతినిధి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మేకల అశ్విని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక చారి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ విమోచన కోసం నాటి ప్రజలు, ఉద్యమకారులు చేసిన పోరాటాలు, వారి త్యాగాలను విద్యార్థులకు సంక్షిప్తంగా వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు.పాఠశాల కరస్పాండెంట్...