EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలి: ఎస్సై సాయిబాబు

    Author THARANGALU NEWS | 18 Sep 2026, 01:08 PM | TELANGANA
    వినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలి: ఎస్సై సాయిబాబు

    అజాద్ హింద్ ఫౌజ్ యూత్ ఆధ్వర్యంలో భక్తి పరవశంలో సామూహిక కుంకుమ పూజ

    గణనాథుడిని దర్శించుకున్న ఎస్సై.. యూత్ సభ్యులకు టీషర్ట్ల పంపిణీ

    గణనాథుని నామస్మరణతో మార్మోగిన ఉత్సవ ప్రాంగణం

    వినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలి: ఎస్సై సాయిబాబు  - Additional Image

    వర్ధన్నపేట ప్రతినిధి,సెప్టెంబర్ 18,తరంగాలు : వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరికి సుఖసంతోషాలు కలగాలని వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు ఆకాంక్షించారు.గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని అజాద్ హింద్ ఫౌజ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజ భక్తి పరవశాన్ని నింపింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ఉత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.ఈ
    కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎస్సై సాయిబాబు హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. గణపతి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, పొరపాట్లకు తావులేకుండా నిర్వాహకులు, యువత సమన్వయంతో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
    అదేవిధంగా గణపతి ఉత్సవాలు భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు పిల్లలు, యువతలో ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించేలా ఉండాలని ఎస్సై సాయిబాబు పేర్కొన్నారు. నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.అనంతరం సట్ల సూరయ్య గౌడ్ ఆధ్వర్యంలో అజాద్ హింద్ ఫౌజ్ యూత్ సభ్యులకు టీషర్ట్లను పంపిణీ చేశారు.
    మహిళలు సామూహికంగా కుంకుమ పూజలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడంతో కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది. యువత, మహిళలు, పిల్లలు,నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    ఇవి కూడా చదవండి

    వినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలి: ఎస్సై సాయిబాబు  - Additional Imageవినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలి: ఎస్సై సాయిబాబు  - Additional Imageవినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలి: ఎస్సై సాయిబాబు  - Additional Imageవినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలి: ఎస్సై సాయిబాబు  - Additional Imageవినాయకుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలి: ఎస్సై సాయిబాబు  - Additional Image