EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు

    Author THARANGALU NEWS | 17 Sep 2026, 06:34 PM | TELANGANA
    విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు

    మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొర్ర సుమలత

    సేవా సంకల్పంతో విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ పంపిణీ

    విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు - Additional Image

    ములుగు ప్రతినిధి , సెప్టెంబర్ 17, తరంగాలు :విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం,మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొర్ర సుమలత అన్నారు.
    ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన ప్రజాజీవితంలో 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ పంపిణీ చేశారు. మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొర్ర సుమలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందజేశారు.
    ఈ సందర్భంగా సిరికొండ బలరాం,కొర్ర సుమలత మాట్లాడుతూ.. విద్యార్థుల చదువుకు అండగా నిలవడం, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యా అవకాశాలను మరింత చేరువ చేయడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల చేతిలో పుస్తకం ఉంటేనే వారి చేతుల్లో భవిష్యత్తు బలపడుతుందని, ఆ దిశగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
    ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాజీవితంలో 25 సంవత్సరాల సేవా ప్రయాణాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప అభియాన్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
    ఈ నేపథ్యంలో ములుగులో విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ అందించడం కేవలం ఒక సేవా కార్యక్రమం మాత్రమే కాకుండా, చదువులో ముందుకు సాగాలనుకునే విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే ప్రయత్నంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు. పరీక్షలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని మంచి ఫలితాలు సాధించి, ఉన్నత విద్యలో రాణించాలని విద్యార్థులకు సూచించారు.
    విద్యార్థుల విజయమే దేశ ప్రగతికి బలమైన పునాది అని, ప్రతి విద్యార్థికి చదువుకునే అవకాశం కల్పించేందుకు భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    విద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు - Additional Imageవిద్యార్థుల భవిష్యత్తే దేశ భవిష్యత్తు - Additional Image