EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

    Author THARANGALU NEWS | 17 Sep 2026, 07:32 PM | TELANGANA
    పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

    పర్వతగిరి, సెప్టెంబర్ 17, తరంగాలు ప్రతినిధి :
    వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మేకల అశ్విని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల చైర్మన్ రాచకొండ అశోక చారి హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ విమోచన కోసం నాటి ప్రజలు, ఉద్యమకారులు చేసిన పోరాటాలు, వారి త్యాగాలను విద్యార్థులకు సంక్షిప్తంగా వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు.పాఠశాల కరస్పాండెంట్ గంజి మహేందర్ మాట్లాడుతూ, తెలంగాణ విమోచనతో ప్రజలకు లభించిన స్వేచ్ఛ, హక్కులు మరియు సామాజిక అభివృద్ధి గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. నాటి పరిస్థితులను, నేటి అభివృద్ధిని పోల్చి చూస్తూ చరిత్రను తెలుసుకోవడం ప్రతి విద్యార్థి బాధ్యత అని పేర్కొన్నారు.పాఠశాల డైరెక్టర్ కోటగిరి రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. గతంలో ఉన్న పరిస్థితులతో పోలిస్తే నేడు గ్రామాలు, విద్య, రవాణా, సాంకేతిక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించామని తెలిపారు. దేశ చరిత్రను తెలుసుకొని, సమాజ అభివృద్ధిలో విద్యార్థులు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
    పాఠశాల ప్రిన్సిపాల్ మేకల అశ్విని మాట్లాడుతూ, తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. వారి ధైర్యం, స్ఫూర్తి, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని దేశం పట్ల బాధ్యతతో మెలగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్లు రాజు, వకుళదేవి, నవ్య శ్రీ, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

    పల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం - Additional Imageపల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం - Additional Imageపల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం - Additional Imageపల్లవి మోడల్ స్కూల్‌లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం - Additional Image