EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వరంగల్ రెడ్ క్రాస్‌కు భూమి,నిధులు కేటాయించండి

    Author THARANGALU NEWS | 15 Nov 2026, 05:56 PM | TELANGANA
    వరంగల్ రెడ్ క్రాస్‌కు భూమి,నిధులు కేటాయించండి

    తెలంగాణ గవర్నర్‌కు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు విజ్ఞప్తి

    చేనేత కార్మికుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన అశోక్ బాబు

    వరంగల్ రెడ్ క్రాస్‌కు భూమి,నిధులు కేటాయించండి - Additional Image

    వరంగల్, నవంబర్ 15 (తరంగాలు ప్రతినిధి):వరంగల్ జిల్లాలో రెడ్ క్రాస్ సేవల విస్తరణతో పాటు స్థానిక చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బేతి అశోక్ బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివ ప్రతాప్ శుక్లాను వరంగల్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బేతి అశోక్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, వరంగల్ జిల్లా ప్రత్యేకతను చాటిచెప్పే చేనేత వస్త్రాలతో రూపొందించిన కార్పెట్, టవల్‌తో పాటు షీల్డ్‌ను అందజేసి ఘనంగా సత్కరించారు.
    అనంతరం వరంగల్ జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు సంస్థకు అవసరమైన స్థలం, తగిన నిధులు కేటాయించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. రక్తనిధి సేకరణ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, మండలాలు, వార్డుల స్థాయిలో ప్రజాప్రతినిధులైన వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఏడాదికి ఒకసారి భాగస్వాములను చేయాలని కోరారు. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేదలు, నిరుపేదలు, బాధితులకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చని వివరించారు.అదేవిధంగా వరంగల్ జిల్లాలోని కొత్తవాడ, శాంపేట ప్రాంతాలకు చెందిన చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. చేనేత కార్మికుల జీవనోపాధిని కాపాడటంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా గవర్నర్ వరంగల్ జిల్లా అభివృద్ధి, రెడ్ క్రాస్ సేవలు, చేనేత కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ దాన కిషోర్ ఐఏఎస్, రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు, ఎస్ఎంసీ నాడం శాంతికుమార్, అభయ ఫౌండేషన్ ప్రతినిధి బాలచంద్ర, రెడ్ క్రాస్ యూత్ వింగ్ ప్రతినిధి బేతి సాయి తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి